హ్యారీపోటర్ న్యూ సిరీస్

హ్యారీపోటర్ న్యూ సిరీస్


సాక్షి, వీకెండ్‌: ఏ సినిమా.? ఏయే థియేటర్లలో.? అయినా ఆదివారం సినిమాలు విడుదల కావే.? అని ఆలోచిస్తుంటే... కాస్త ఆగండి... విడుదలకు సిద్ధంగా ఉన్నది ఒక పుస్తకం. అమ్మకాల్లో రికార్డులు సాధించే ఆ పుస్తకం కోసం ఎనిమిదేళ్ల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. జేకే రౌలింగ్‌ రాసిన హ్యారీపోటర్‌ పుస్తకాల సీరిస్‌ గురించి పరిచయం అక్కర్లేదు.


ఆమె రాసిన సీరిస్‌ పుస్తకాలుగానే కాదు చిత్రాలుగా కూడా విశేష ఆదరణ పొందాయి. ఆమె పుస్తకాల కోసం పాఠక ప్రపంచం ఎదురు చూస్తుంటుంది. పుస్తకం విడుదల తేదీకి ముందే ప్రతి పుస్తక దుకాణంలో, ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు మొదలైపోతాయి. పుస్తక ప్రపంచంలోనే ఇటీవల కాలంలో ఇంతటి ప్రభంజనం మరే పుస్తకం విషయంలో ఉండదేమో...    


వెరీ ఇంట్రెస్టింగ్..

ఏడో సీరిస్‌తో హ్యారీపోటర్‌ సీరిస్‌లు ఆగిపోతాయి.. అనే కథనాలు అప్పట్లో జోరందుకున్నాయి. దాంతో పోటర్‌ పుస్తక ప్రియులు నిరుత్సాహపడ్డారు. కానీ ఎనిమిదేళ్ల విరామం అనంతరం విడుదలవుతున్న హ్యారీపోటర్‌– కర్స్‌డ్‌ చైల్డ్‌ పుస్తకంపై నగరవాసుల్లోనూ ఎంతో ఆసక్తి కనిపిస్తోంది. ‘హ్యారీపోటర్‌ అండ్‌ ది కర్స్‌డ్‌ చైల్డ్‌’ పుస్తకం విడుదలకు సిద్ధం కావడంతో పుస్తకాల షాపుల్లో పండుగ హడావుడి కొనసాగుతోంది. కింగ్స్‌ క్రాస్‌ స్టేషన్, హ్యారీ చదువుకున్న ఇంద్రజాల పాఠశాల హాగ్‌వర్ట్‌ ఫోర్ట్‌ నమూనాలు బుక్‌షాపుల్లో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇక ఆదివారం విడుదల కానున్న ఈ పుస్తకం కాపీలను ముందుగానే బుక్‌ చేసుకున్న వారు నగరంలో వేలల్లో ఉన్నారు అంటున్నారు బుక్‌ షాప్‌ కీపర్స్‌.పాత సీరిస్‌కి పెరిగిన గిరాకీ..

ఈ సీరిస్‌ మొదటి నుంచి ఫాలో అవుతున్న నగర రీడర్స్‌ ఎంతో ఆసక్తిగా ఈ పుస్తకం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఆసక్తి ఎంతగా ఉందటే ముందటి సీరిస్‌ పుస్తకాల అమ్మకాలు కూడా ఈ పుస్తకం విడుదల సందర్భంగా ఊపందుకున్నాయి.నవలా? నాటకమా?

ఈ సీరిస్‌ కథ ఎలా ఉండబోతోందనే విషయంలో ముందు నుంచే చర్చ మొదలైంది. ఈ పుస్తకం నవలా? లేక నాటకంగా సాగుతుందా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పుస్తకం నాటక రూపంలో సాగనుంది. ఇది ఒక రిహార్సల్‌ స్క్రిప్ట్‌ అని తెలుస్తోంది.స్పెషల్‌ షోలు..

సోమాజిగూడ ల్యాండ్‌మార్క్‌లో ఆదివారం హ్యారీపోటర్‌ పుట్టిన రోజును సెలబ్రేట్‌ చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు పాల్గొనేలా కేక్‌ కట్టింగ్, మ్యాజిక్, క్విజ్‌షోలు ఏర్పాటు చేసినట్లు షాపు నిర్వాహకులు తెలిపారు.  

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top