హరితహారం సామాజిక కార్యక్రమం | Haritaharam social program | Sakshi
Sakshi News home page

హరితహారం సామాజిక కార్యక్రమం

Jul 21 2016 12:21 AM | Updated on Sep 4 2017 5:29 AM

ములుగు : హరితహారం అనేది కేవలం ప్రభు త్వ కార్యక్రమమే కాదని, ప్రజలు మెచ్చిన సామాజిక ఉద్యమమని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ములుగులో రూ.80 లక్షలతో నిర్మించిన బీసీ సంక్షేమ హాస్టల్‌ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.

  • అటవీ శాఖ మంత్రి జోగు రామన్న 
  • ములుగు : హరితహారం అనేది కేవలం ప్రభు త్వ కార్యక్రమమే కాదని, ప్రజలు మెచ్చిన సామాజిక ఉద్యమమని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ములుగులో రూ.80 లక్షలతో నిర్మించిన బీసీ సంక్షేమ హాస్టల్‌ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.
    అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బీసీ హాస్టల్‌ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గమనించిన సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో రూపొందించారని అన్నారు. మంగళవారం వరకు రాష్ట్రంలో 11.40 కోట్ల  మొక్కలు నాటామని, రాష్ట్ర వ్యాప్తంగా 46 కోట్ల మొక్కలు నాటి తీరుతామని చెప్పారు. గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్‌ మాట్లాడుతూ నాటిన మొక్క ల్లో 50 శాతానికి పైగా కాపాడుకుంటే ప్రభుత్వం నుంచి మెయింటెనెన్స్‌ చార్జీలు అందిస్తామని చెప్పారు.  కార్యక్రమంలో అటవీశాఖ ఫ్లయిం గ్‌ స్క్వాడ్‌ డీఎఫ్‌ఓ కేశరాం, జనెటిస్ట్‌ డీఎఫ్‌ఓ ముకుందరావు, ఎఫ్‌ఆర్వో నాగేశ్వర్‌రావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ పి.వి. ప్రసాదరావు, ఎంపీపీ భూక్య మంజుల, ఎంపీడీఓ విజయ్‌స్వరూప్, బీసీ సంక్షేమ శాఖ డీడీ నర్సింహరావు పాల్గొన్నారు. 
    కేసీఆర్‌ మానసపుత్రిక .. 
    వెంకటాపురం :  హారితహారం కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానసపుత్రిక అని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం ఆయన  వెంకటాపురం మండల కేంద్రంలో పర్యాటక శాఖ మంత్రి చందూలాల్‌తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమని, ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో 40వేల మొక్కలు, నియోజకవర్గ పరిధిలో 40లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో డీఎఫ్‌ఓ భీమానాయక్, ము లుగు రేంజ్‌ ఆఫీసర్‌ నాగేశ్వర్‌రావు, డీఆర్‌ఓ నరేందర్, తహసీల్దార్‌ హన్మంతరావు, ఎంపీడీఓ బాలకృష్ణ  పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement