ఉత్తమ్.. రాజీనామాకు సిద్ధమా? | hareesh rao challange to uttamkumar reddy | Sakshi
Sakshi News home page

ఉత్తమ్.. రాజీనామాకు సిద్ధమా?

Feb 21 2016 4:13 AM | Updated on Sep 19 2019 8:44 PM

ఉత్తమ్.. రాజీనామాకు సిద్ధమా? - Sakshi

ఉత్తమ్.. రాజీనామాకు సిద్ధమా?

మిషన్ కాకతీయలో అక్రమాలు జరగలేదని రుజువు చేస్తే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా?

మంత్రి హరీశ్‌రావు
సంగారెడ్డి మున్సిపాలిటీ: మిషన్ కాకతీయలో అక్రమాలు జరగలేదని రుజు వు చేస్తే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా? అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. మిషన్ కాకతీయ టెండర్లలో అక్రమాలు జరిగాయంటూ కోర్టుకు వెళ్తామని ఉత్తమ్  ప్రకటించడంపై హరీశ్ తీవ్రంగా స్పందించారు. శనివారం సం గారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో  జరిగిన జలయజ్ఞం అక్రమాలు ఉత్తమ్‌కు కనిపిం చలేదా? అని ప్రశ్నించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీ రథలపై  పారదర్శకంగా వ్యవహరించామన్నారు. కేంద్ర ప్రభు త్వ సంస్థ వ్యాప్కోస్ ద్వారా సర్వే నిర్వహించి టెండర్లు వేశామని పేర్కొన్నారు. రూ.10 లక్షల నుంచి రూ.10 వేల పనుల వరకు ఈ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు పిలవడం వల్ల ప్రభుత్వానికి రూ.1200 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

 మెదక్ ఎస్పీపై డీజీకి మంత్రి హరీశ్‌రావు ఫిర్యాదు
 సాక్షి సంగారెడ్డి ప్రతినిధి: ‘మెదక్ జిల్లాలో దొంగలు పేట్రేగుతున్నారు. దీంతో ఇంటికి తాళం వేయాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదును దోచుకెళ్తున్నారు. కానీ పోలీసుశాఖ మాత్రం నిద్రమత్తులో వుంది. ‘సీసీ కెమెరాలు వున్నాయంటున్నారు.. నిఘా పెంచామంటున్నారు. కానీ దొంగతనాలు మాత్రం ఆగడం లేదు’ అని భారీ నీటిపారుద లశాఖ మంత్రి హరీశ్‌రావు పోలీసుశాఖపై శనివారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  సంగారెడ్డిలో ఇటీవల దొంగతనాలు జరిగిన ఇళ్లను స్వయంగా ఆయన శనివారం సందర్శించి బాధితులను ఓదార్చారు. మెదక్ జిల్లా ఎస్పీ సుమతిపై మంత్రి హరీశ్‌రావు డీజీకి ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి పోలీసులతో సమీక్ష జరిపి ఇకపై దొంగతనాలు జరగొద్దంటూ ఆదేశించారు. నిఘా ముమ్మరం చేయాలని, ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement