గూడూరు జెడ్పీటీసీని సస్పెండ్‌ చేస్తూ జీవో జారీ | Gudur jedpitisini suspended the issuance of the GO | Sakshi
Sakshi News home page

గూడూరు జెడ్పీటీసీని సస్పెండ్‌ చేస్తూ జీవో జారీ

Aug 5 2016 12:09 AM | Updated on Sep 4 2017 7:50 AM

జిల్లాలోని గూడూరు మండలం జెడ్పీటీసీ సభ్యుడు ఖాసింను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గురువారం ప్రభుత్వం జీఓ జారీ చేసింది.

హన్మకొండ : జిల్లాలోని గూడూరు మండలం జెడ్పీటీసీ సభ్యుడు ఖాసింను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గురువారం ప్రభుత్వం జీఓ జారీ చేసింది. జిల్లాలో అటవీ భూముల ఆక్రమణ విషయంలో ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణకు పంపిన నివేదిక ఆధారంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జూలై 27వ తేదీన జెడ్పీటీసీ సభ్యుడిని సస్పెండ్‌ చేస్తూ ఫైల్‌పై సంతకం చేశారు. ఈ జీఓ జారీ కావడంతో జెడ్పీ టీసీ సభ్యుడిగా ఖాసింను పదవీ నుంచి సస్పెండ్‌ అయినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement