తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభత్వం అ«ధికారికంగా నిర్వహించాలి | Govt must managed Telangana libaration day | Sakshi
Sakshi News home page

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభత్వం అ«ధికారికంగా నిర్వహించాలి

Sep 1 2016 10:44 PM | Updated on Sep 4 2017 11:52 AM

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభత్వం అ«ధికారికంగా నిర్వహించాలి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభత్వం అ«ధికారికంగా నిర్వహించాలి

నిజాం పరిపాలన నుంచి∙తెలంగాణ ప్రాంతం విముక్తి పొందిన సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనగాల వెంకట్రామయ్య, నూనె సులోచనలు కోరారు.

కోదాడఅర్బన్‌: నిజాం పరిపాలన నుంచి∙తెలంగాణ ప్రాంతం విముక్తి పొందిన సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనగాల వెంకట్రామయ్య,  నూనె సులోచనలు కోరారు. ఈ మేరకు గురువారం కోదాడ తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందికి పలువురు బీజేపీ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం పరిపాలన నుంచి∙తెలంగాణ ప్రాంతంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు విముక్తి పొందాయన్నారు. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా  నిర్వహిస్తుంటే తెలంగాణలో నిర్వహించకపోవడం విచారకరమన్నారు. విమోచన దినోత్సవాలు తెలంగాణ ప్రాంత ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం వీటిని అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంగవీటి శ్రీనివాసరావు, సాతులూరి హనుమంతరావు, కనగాల నారాయణ, యరగాని రాధాకృష్ణ, చిలుకూరి శ్రీనివాస్, పోలా సురేష్, తూములూరి సత్యనారాయణ, చిన్నా, కిలారు Ðð ంకటేశ్వర్లు, రాజాలు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement