మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం
మైనార్టీల సంక్షేమాన్ని ప్రభుత్వ విస్మరించిందని ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. మంగళవారం పట్టణంలోని సాయిబాబా పేటలో ఉన్న ముబారక్ షాదీఖానాలో ముస్లిం మైనార్టీల అవగాహన సదస్సు నిర్వహించారు.
నందికొట్కూరు: మైనార్టీల సంక్షేమాన్ని ప్రభుత్వ విస్మరించిందని ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. మంగళవారం పట్టణంలోని సాయిబాబా పేటలో ఉన్న ముబారక్ షాదీఖానాలో ముస్లిం మైనార్టీల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారని గుర్తు చేశారు.అయితే, టీడీపీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్‌కు తూటు్లపొడుస్తోందని మండిపడ్డారు. ఇమాంలకు ఇచ్చిన హామీ ప్రకారం జీత భత్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
షాదీఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేయించానని, త్వరలో పనులు చేపడతామన్నారు. ముస్లిం వికలాంగులకు, వితంతువులకు, నిరుపేద మహిళలకు బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలని చెప్పారు. వారం రోజుల్లో ఉరూ్ద కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా మైనార్టీ వెలే్ఫర్ ఆఫీసర్ మస్తాన్‌వలి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముస్లింల సంక్షేమానికి ఎమ్మెల్యే ఐజయ్య ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. షాదీఖానా, ఉర్థూ జూనియర్ కళాశాల మంజూరే అందుకు నిదర్శనమన్నారు.దుల్హన్ పథకాన్ని ముసి్లంలు సది్వనియోగం చేసుకోవాలని కోరారు. వక్ఫ్‌బోర్డులో మసీదులను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇమాంలకు జీతాలు వస్తాయన్నారు. అవగాహన సదస్సులో వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ ఇనాయతుల్లా, సిబ్బంది మహెబూబ్‌బాషా, ఆవాజ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి అబుబక్కర్, డివిజన్ నాయకులు సలాంఖాన్, రహిమాన్, తదితరులు పాల్గొన్నారు