హమీల అమలులో ప్రభుత్వం విఫలం | governament failur to solve promises | Sakshi
Sakshi News home page

హమీల అమలులో ప్రభుత్వం విఫలం

Jul 20 2016 4:50 PM | Updated on Sep 4 2017 5:29 AM

హమీల అమలులో ప్రభుత్వం విఫలం

హమీల అమలులో ప్రభుత్వం విఫలం

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆచారణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్‌ విమర్శించారు

చిలుకూరు: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆచారణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్‌ విమర్శించారు,  బుధవారం చిలుకూరులో జరిగిన టీడీపీ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రచార  ఆర్భాటాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. సామాన్య ప్రజల బాధలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హత కలిగిన వారికి పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.  ప్రజా సమస్యలపై త్వరలో దశల వారి పోరాటాలు చేస్తామన్నారు. కరువు నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.   ఈ కార్యక్రమంలో చిలుకూరు, కోదాడ, మునగాల, నడిగూడెం, మోతే మండల పార్టీ అధ్యక్షులు సాతులూరి గురవయ్య, ఆదినారాయణ, అంజనేయులు, సుంకర అజయ్‌కుమార్, జానకీరాములు, జిల్లా, మండల నాయకులు కొల్లు నర్సయ్య, అలసకాని జనార్ధన్, కొల్లు సత్యనారాయణ, కొండా సోమయ్య,  దండ వీరబద్రం, ఉప్పగళ్ల శ్రీను, గందం పాండు, కోటిరెడ్డి, ప్రమీళ,సైదిరెడ్డి, బూర మల్లయ్య, కొడారు రాంబాబు,  కొండా పెరమయ్య, జానిమియా , నాగరాజు తదితరులు పాల్గొన్నారు.  
 





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement