breaking news
failur
-
పేలిపోయిన స్టార్‌షిప్ రాకెట్
టెక్సాస్: స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ప్రయోగించిన కొద్దిసేపటికే అంతరిక్షంలో పేలిపోయింది. అమెరికాకు చెందిన అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ శనివారం టెక్సాస్ నుంచి ఈ ప్రయోగం చేపట్టింది. ఎనిమిది నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్ పైభాగం బూస్టర్ నుంచి విజయవంతంగా వేరుపడింది. అనంతరం భూమితో సంబంధాలు తెగిపోయాయి. ప్రత్యక్ష ప్రసారం నిలిచిపోయింది. కొద్దిక్షణాల్లోనే అది పేలిపోయింది. ఇంధనంతో కలిపి ఈ భారీ స్టార్ షిప్ మొత్తం బరువు 5 వేల టన్నులు కాగా వ్యాసం 9 మీటర్లు, ఎత్తు 121 మీటర్లు. ఇదే సంస్థ ఏప్రిల్‌లో మొదటి ప్రయోగం చేపట్టింది. నాలుగు నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్ పేలిపోయింది. -
హమీల అమలులో ప్రభుత్వం విఫలం
చిలుకూరు: టీఆర్ఎస్ ప్రభుత్వం ఆచారణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు, బుధవారం చిలుకూరులో జరిగిన టీడీపీ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. సామాన్య ప్రజల బాధలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హత కలిగిన వారికి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై త్వరలో దశల వారి పోరాటాలు చేస్తామన్నారు. కరువు నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు, కోదాడ, మునగాల, నడిగూడెం, మోతే మండల పార్టీ అధ్యక్షులు సాతులూరి గురవయ్య, ఆదినారాయణ, అంజనేయులు, సుంకర అజయ్‌కుమార్, జానకీరాములు, జిల్లా, మండల నాయకులు కొల్లు నర్సయ్య, అలసకాని జనార్ధన్, కొల్లు సత్యనారాయణ, కొండా సోమయ్య, దండ వీరబద్రం, ఉప్పగళ్ల శ్రీను, గందం పాండు, కోటిరెడ్డి, ప్రమీళ,సైదిరెడ్డి, బూర మల్లయ్య, కొడారు రాంబాబు, కొండా పెరమయ్య, జానిమియా , నాగరాజు తదితరులు పాల్గొన్నారు.