పవర్‌ లిఫ్టింగ్‌లో బంగారు పతకాలు | goldmedels in powerliftiong | Sakshi
Sakshi News home page

పవర్‌ లిఫ్టింగ్‌లో బంగారు పతకాలు

Jan 2 2017 7:30 PM | Updated on Sep 5 2017 12:12 AM

పవర్‌ లిఫ్టింగ్‌లో బంగారు పతకాలు

పవర్‌ లిఫ్టింగ్‌లో బంగారు పతకాలు

మంగళగిరి : డిసెంబర్‌ 26 నుంచి 31వ తేదీ వరకు జార్ఖండ్‌ రాష్ట్రం జంషెడ్‌పూర్‌లో జరిగిన సుబ్రతా క్లాసిక్‌ ఇంటర్నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలలో గుంటూరు జిల్లాకు చెందిన జి.సాయిరేవతి, బి.చంద్రిక బంగారు పతకాలు సాధించడం అభినందనీయమని జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోషియేషన్‌ ప్రధాన కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు అన్నారు

 

మంగళగిరి : డిసెంబర్‌ 26 నుంచి 31వ తేదీ వరకు జార్ఖండ్‌ రాష్ట్రం జంషెడ్‌పూర్‌లో జరిగిన సుబ్రతా క్లాసిక్‌ ఇంటర్నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలలో గుంటూరు జిల్లాకు చెందిన జి.సాయిరేవతి, బి.చంద్రిక బంగారు పతకాలు సాధించడం అభినందనీయమని జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోషియేషన్‌ ప్రధాన కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు అన్నారు. పట్టణంలోని హెల్త్‌జిమ్‌లో సోమవారం వారిద్దరినీ ఆయన అభినందించారు. జి.సాయిరేవతి 357.5 కేజీల బరువును ఎత్తి, బి.చంద్రిక 339 కేజీల బరువును ఎత్తి గోల్డ్‌ మెడల్‌ సాధించినట్లు తెలిపారు. అభినందన కార్యక్రమంలో అసోషియేషన్‌ నాయకులు మహ్మద్‌ రఫీ, ఎన్‌.శేషగిరిరావు, ఎండీ ఖమురుద్దీన్, షేక్‌ సంధాని తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement