చెస్‌ పోటీల్లో బంగారు పతకం | gold medel in chess competation | Sakshi
Sakshi News home page

చెస్‌ పోటీల్లో బంగారు పతకం

Sep 28 2016 12:07 AM | Updated on Jul 29 2019 7:35 PM

బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న శ్యాంప్రసాద్‌రెడ్డి - Sakshi

బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న శ్యాంప్రసాద్‌రెడ్డి

భువనేశ్వర్‌లో ఈ నెల 23నుంచి 27వ తేదీ వరకు జరిగిన 47వ కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ జాతీయ చెస్‌ క్రీడా పోటీల్లో తిరుపతి విద్యార్థి ప్రథమస్థానం కైవసం చేసుకుని బంగారు పతకం సాధించాడు.

తిరుపతి ఎడ్యుకేషన్‌ : భువనేశ్వర్‌లో ఈ నెల 23నుంచి 27వ తేదీ వరకు జరిగిన 47వ  కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ జాతీయ చెస్‌ క్రీడా పోటీల్లో  తిరుపతి విద్యార్థి ప్రథమస్థానం కైవసం చేసుకుని బంగారు పతకం సాధించాడు. తిరుపతి చెన్నారెడ్డికాలనీలోని కేంద్రీయ విద్యాలయ పాఠశాల 6వ తరగతి విద్యార్థి కె.శ్యాంప్రసాద్‌రెడ్డి అండర్‌–14విభాగంలో పాల్గొన్నాడు. మొదటి నుంచి అపార క్రీడా ప్రతిభ చాటి  ప్రథమ స్థానం కైవసం చేసుకుని బంగారు పతకాన్ని సాధించాడు.  అక్టోబర్‌లో  స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్‌ సీహెచ్‌.ప్రసాదరావు, పీఈటీ జీ.శేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయులు అభినందనందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement