మహిళ మెడలో గొలుసు చోరీ | gold chain snatch in nellore | Sakshi
Sakshi News home page

మహిళ మెడలో గొలుసు చోరీ

Jun 2 2017 8:40 AM | Updated on Sep 18 2018 8:38 PM

మహిళ మెడలో గొలుసు చోరీ - Sakshi

మహిళ మెడలో గొలుసు చోరీ

ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు.

నెల్లూరు (క్రైమ్‌) : ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. ఈ సంఘటన కరెంట్‌ ఆఫీస్‌ సెంటర్‌ రైల్వే గేటు సమీపంలో గురువారం పట్టపగలు జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... అనగుంటకు చెందిన ఎం. శైలజ ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె గురువారం ఉదయం కరెంట్‌ ఆఫీస్‌సెంటర్‌లోని బంధువుల ఇంట్లో పనులు చేసేందుకు వెళ్లింది. తిరిగి ఇంటికి నడుచుకొంటూ వెళ్తుండగా, కరెంట్‌ఆఫీస్‌ రైల్వేగేటు సమీపంలోని రైల్వే అండర్‌ (పాస్‌) బ్రిడ్జి కింద నుంచి వెళుతుండగా గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చారు.

ఆమె మెడలోని మూడు సవర్ల బంగారు గొలుసును తెంపుకెళ్లారు. ఈక్రమంలో ఆమె మెడకు స్వల్ప గాయాలైంది. దీంతో బాధితురాలు  పెద్దగా కేకలు వేసే సరికే దుండగులు బైక్‌ వేగం పెంచి పరారయ్యారు. స్థానికులు ఆమె వద్దకు చేరుకుని చోరీ ఘటనపై ఐదోనగర పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ విజయకుమార్‌ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి నిందితుల వివరాలను సేకరించి సెట్‌లో నగర పోలీసులను అలెర్ట్‌ చేశారు. దీంతో పోలీసులు నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో పలు సంఘటనలు చోటు చేసుకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement