అధికారులతో జీఎం సమీక్ష | gm review with officers | Sakshi
Sakshi News home page

అధికారులతో జీఎం సమీక్ష

Aug 13 2016 6:49 PM | Updated on Sep 4 2017 9:08 AM

సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న జీఎం

సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న జీఎం

సెంటినరీకాలనీ : సింగరేణి సంస్థ ఆర్జీ–3 డివిజన్‌లోని జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో ఆర్జీ–3 జీఎం ఎంఎస్‌.వెంకట్రామయ్య అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ నిన్న సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ బొగ్గు ఉత్పత్తి తగ్గడంపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థలో ఉత్పత్తిని పెంచడానికి తగిన చర్యలు తీసుకుంటూనే రక్షణకు ప్రాదాన్యత ఇచ్చి రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలన్నార

సెంటినరీకాలనీ : సింగరేణి సంస్థ ఆర్జీ–3 డివిజన్‌లోని జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో ఆర్జీ–3 జీఎం ఎంఎస్‌.వెంకట్రామయ్య అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ నిన్న సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ బొగ్గు  ఉత్పత్తి తగ్గడంపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థలో ఉత్పత్తిని పెంచడానికి తగిన చర్యలు తీసుకుంటూనే రక్షణకు ప్రాదాన్యత ఇచ్చి రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి వృథా వ్యయాలు ఆపడానికి ప్రతి ఒక్కరూ పాటుపడి సంస్థను లాభాల బాటలో నిలుపాలన్నారు. అధికారులు, కార్మికులు కలిసికట్టుగా పని చేసి ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి సంస్థ మనుగడలో భాగస్వాములు కావాలని సంస్థ లాభాల్లో పయనించిన నాడే మనకు సంస్థకు అన్ని విధాలా శ్రేయస్కరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓసీపీ–1,2 పీవోలు శ్రీనివాసరావు, వీరస్వామి, ఎస్వో–2 జీఎం పి. శ్రీనివాస్, ఏరియ ఇంజనీర్‌ వైజీకే మూర్తి, పర్సనల్‌ మేనేజర్‌ సాల్మన్‌రాజ్, డీజీఎం ఐఈడీ సీÜహెచ్‌.వెంకయ్య, డీజీఎం సివిల్‌ నాగేశ్వర్‌రావు, డీజీఎం ఫైనాన్స్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement