పాధ్యాయులకు అందజేయడం అభినందనీయమన్నారు. ఉపా«ధ్యాయులు ఆధునిక పరిజ్ఞానాన్ని తరగతి గదిలో ఉపయోగించడం అవసరమన్నారు. సీఆర్పీలు స్కూలు సందర్శన సమయంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నారు. విద్యార్థుల ఆధార్ నమోదు త్వరితగతిన చేపట్టాలన్నారు. త్వరలో జరగున్న పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలన్నారు. కార్యక్ర
బోధనోపకరణాలకు అత్యంత ప్రాముఖ్యం ఇవ్వాలి
Jul 22 2016 12:02 AM | Updated on Sep 4 2017 5:41 AM
కంబాలచెరువు : బోధనోపరకణాలకు అత్యంత ప్రాముఖ్యం ఇవ్వాలని సర్వశిక్షాఅభియాన్ జిల్లా అకడమిక్ మానిటరింగ్ అ«ధికారి చామంతి నాగేశ్వరరావు అన్నారు. స్థానిక కోటగుమ్మం వద్ద ఉన్న మండల వనరుల కేంద్రలో డీఐసీ, సీఆర్పీ, విషయ నిపుణులతో సమీక్షా సమావేశం గురువారం జరిగిం ది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఇప్పుడు అన్ని తరగతుల్లో కృత్యాధార బోధన జరుగుతోందని, ఉపాధ్యాయులు ప్రతీ అంశానికి బోధనోపకరణాన్ని తయారుచేయాలన్నారు. త్వరలో జిల్లాస్థాయిలో ఒక వర్క్‌షాప్ నిర్వహిస్తామని, ప్రాథమిక సబ్జెక్టుల్లో అన్ని అంశాలకు టీఎల్‌ఎం తయారు చేసేలా విషయ నిపుణులకు శిక్షణ ఇస్తామన్నారు. గణిత విషయనిపుణులు భమిటిపాటి ఫణికుమార్ తయారుచేసిన టీఎల్‌ఎమ్ సంతృప్తికరంగా ఉందన్నారు. ఫణికుమార్ వాట్సాప్ వేదికగా గురుదేవోభవ, బాలవాణì , నిత్యవిద్యార్థి, గ్రూప్‌ద్వారా తగు సమాచారాన్ని, విద్యార్థుల కృత్యాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు అందజేయడం అభినందనీయమన్నారు. ఉపా«ధ్యాయులు ఆధునిక పరిజ్ఞానాన్ని తరగతి గదిలో ఉపయోగించడం అవసరమన్నారు. సీఆర్పీలు స్కూలు సందర్శన సమయంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నారు. విద్యార్థుల ఆధార్ నమోదు త్వరితగతిన చేపట్టాలన్నారు. త్వరలో జరగున్న పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సహాయ ఏఎంఓ శ్రీనివాసాచార్యులు, అర్బన్ డీఐ అయ్యంకి తులసీదాస్, జయంతి శాస్త్రి, ప్రసాద్, శ్రీనివాసరావు, కుమారి, నీలిమ, ఇందిర, భమిడిపాటి ఫణికుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement