పరిశ్రమలకు భూములు ఇవ్వం | Give land for industries | Sakshi
Sakshi News home page

పరిశ్రమలకు భూములు ఇవ్వం

Sep 14 2016 12:05 AM | Updated on Sep 4 2017 1:21 PM

పరిశ్రమల స్థాపనకు తమ భూములు ఇచ్చేది లేదని వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం ఎలుకుర్తి గ్రామ రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఉద్య మం తప్పదని హెచ్చరించారు.

  • పురుగుమందు డబ్బాలతో ఎలుకుర్తి రైతుల నిరసన
  • ధర్మసాగర్‌ : పరిశ్రమల స్థాపనకు తమ భూములు ఇచ్చేది లేదని వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం ఎలుకుర్తి గ్రామ రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వం  బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఉద్య మం తప్పదని హెచ్చరించారు.  పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం గుర్తించిన భూ యజమానులు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామంలోని సర్వే నంబర్‌ 160లోని 216 ఎకరాల భూమిని 40 సంవత్సరాల క్రితం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 250 మంది పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసి పట్టాలు ఇచ్చిందని, ఇప్పటి ప్రభుత్వం వాటిని లాక్కోవాలని చూస్తోందని ఆరోపిం చారు. భూములు కోల్పోతే తమకు జీవనాధారం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమన్నారు.
     
    భూములు తీసుకుంటామంటూ తమ కు ఇటీవలే నోటీసులుఇచ్చారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాలు పం పిణీ చేస్తామని చెప్పిన కేసీఆర్‌.. అవి ఇవ్వకపోగా తమ భూములు లాక్కోవడం ఏంటని ప్రశ్నించా రు. అనంతరం భూములను లాక్కోవద్దని కోరుతూ రైతులు క్రిమిసంహారక మందు డబ్బాలు చేతి లో పట్టుకుని నిరసన తెలుపుతూ స్థానిక సర్పంచ్‌ గుం డవరపు రాంచందర్‌రావు, ఎంపీటీసీ సభ్యు డు జోగు శేఖర్‌లకు వినతి పత్రం అందించారు.
     
    ఈ సందర్భంగా సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు మాట్లాడుతూ గ్రామంలోరైతులపక్షాన నిలుస్తామని, ఎట్టి పరిస్థితుల్లోను భూములుప్రభుత్వంతీసుకోకుండా చూస్తామని తెలిపారు.రైతులు కొలిపాక జార్జ్, కన కం ఇజ్రాయిల్, పిట్టల వెంకటయ్య,  కేతిరి వెంకటయ్య,రాజయ్య, ఎం. సమ్మయ్య పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement