రాయలసీమకు ప్రత్యక ప్యాకేజీ ఇవ్వాలి | gayanandh demand on special package to rayalaseema | Sakshi
Sakshi News home page

రాయలసీమకు ప్రత్యక ప్యాకేజీ ఇవ్వాలి

Aug 9 2016 10:20 PM | Updated on Sep 4 2017 8:34 AM

అన్ని విధాలుగా వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం రూ.50వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ, రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్‌ డాక్టర్‌ గేయానంద్‌ కోరారు.

ప్రొద్దుటూరు కల్చరల్‌:  అన్ని విధాలుగా వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం రూ.50వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ, రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్‌ డాక్టర్‌ గేయానంద్‌ కోరారు. మంగళవారం ప్రొద్దుటూరులో రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలో రాయలసీమకు పొందుపరిచిన ఉక్కు కర్మాగారం, రూ.24వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజి, యూనివర్సిటీలు, పరిశ్రమలు, ప్రాజెక్టులను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమను సెయిల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినప్పుడు నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. సీమకు నీరు, నిధులు విస్తృతంగా లభించినప్పుడే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షుడు నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్‌రెడ్డి, సీపీఎం నాయకులు సత్యనారాయణ, అన్వేష్, రచయిత జింకా సుబ్రమణ్యం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement