గార్గేయపురం చెరువును సిటీ పార్కుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు.
సిటీ పార్కుగా గార్గేయపురం చెరువు
Oct 29 2016 11:16 PM | Updated on Mar 21 2019 8:35 PM
–జిల్లా కలెక్టర్ విజయమోహన్
కర్నూలు(అగ్రికల్చర్): గార్గేయపురం చెరువును సిటీ పార్కుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ తన చాంబరులో సమీక్ష నిర్వహించారు. అటవీ, టూరిజం, ఇరిగేషన్ పంచాయతీరాజ్ శాఖల అధికారులు సంయుక్తంగా గార్గేయపురం చెరువును సిటీ పార్కుగా అభివృద్ధి చేసేందుకు తగిన ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులు ఇస్తానని వివరించారు. కర్నూలు ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే విధంగా పార్కును తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇక్కడ నెమళ్లు ఇతర ఆకర్షణీయమైన పక్షుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. చిన్నచిన్న కాటేజీలు ఏర్పాటు చేయడంతోపాటు రెస్టారెంటు కూడ నిర్మించాలన్నారు. సంగమేశ్వరంలో రెండు బోట్లు ఉన్నాయని అందులో ఒకదానిని గార్గేయపురం చెరువుకు తీసుకురావాలన్నారు. సమావేశంలో అటవీశాఖ కన్జర్వేటర్ జేఎస్‌ఎన్ మూర్తి, కర్నూలు డీఎఫ్‌ఓ చంద్రశేఖర్, జిల్లా పర్యాటకశాఖ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement