గంగానమ్మకు జలాభిషేకం
గాలాయిగూడెం (దెందులూరు) : గ్రామంలోని గంగానమ్మతల్లికి గురువారం భక్తి శ్రద్ధలతో జలాభిషేకం నిర్వహించారు. మాజీ సర్పంచ్ కూరంశెట్టి నాగ శిరోమణి, కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కూరంశెట్టి రామ్మోహనరావు, కుటుంబ సభ్యులు ఆధ్వర్యం వహించారు.
గాలాయిగూడెం (దెందులూరు) : గ్రామంలోని గంగానమ్మతల్లికి గురువారం భక్తి శ్రద్ధలతో జలాభిషేకం నిర్వహించారు. మాజీ సర్పంచ్ కూరంశెట్టి నాగ శిరోమణి, కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కూరంశెట్టి రామ్మోహనరావు, కుటుంబ సభ్యులు ఆధ్వర్యం వహించారు. తొలుత మాజీ సర్పంచ్ జలాలతో ఉన్న బోనాలను ప్రారంభించారు. మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకుని మేళతాళాల నడుమ గ్రామంలో ఊరేగించారు. గంగానమ్మ తల్లి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజలు చేశారు. అనంతరం కూరంశెట్టి నాగ శిరోమణి, మహిళలు గంగానమ్మతల్లికి జలాభిషేకం నిర్వహించారు. తుంగా రత్నాకరరావు, పసుమర్తి సాంబశివరావు, అచ్చంతల్లి ఆలయ మాజీ ఛైర్మన్ పసుపులేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.