పాఠశాలలను పచ్చదనంతో నింపుతాం | fullfilled plants in schools | Sakshi
Sakshi News home page

పాఠశాలలను పచ్చదనంతో నింపుతాం

Jul 22 2016 5:58 PM | Updated on Mar 28 2018 11:26 AM

ల్లాలోని పాఠశాలలను పచ్చదనంగా మారుస్తామని, అందుకోసం ఉపాధ్యాయులు కంకణబద్ధులు కావాలని డీఈఓ రమేష్‌ అన్నారు. శుక్రవారం స్థానిక మేరరీ ఏ నాట్స్‌ పాఠశాలలో డివిజన్‌లోని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో హరితహారంపై సమావేశం నిర్వహించారు.

వికారాబాద్‌ రూరల్‌ : జిల్లాలోని పాఠశాలలను పచ్చదనంగా మారుస్తామని, అందుకోసం ఉపాధ్యాయులు కంకణబద్ధులు కావాలని డీఈఓ రమేష్‌ అన్నారు. శుక్రవారం స్థానిక మేరరీ ఏ నాట్స్‌ పాఠశాలలో డివిజన్‌లోని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో హరితహారంపై సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాఠశాల ఆవరణ మొత్తం పచ్చదనంతో కళకళలాడేలా చేయాలని ఉపాధ్యాయులకు సూచించినట్టు చెప్పారు. ప్రతి విద్యార్థికి ఒక మొక్కను దత్తత ఇచ్చి వాటి సంరక్షణ అప్పగిస్తామన్నారు. మొక్కలకు కూడా పుట్టిన రోజు జరిపేలా చూస్తామన్నారు. పాఠశాలలో ఎన్‌జీసీ( నేషనల్‌ గ్రీనరీ క్రాప్‌) ఏర్పాటు చేసి హరితదళం ఏర్పాటు చేస్తామన్నారు. మొక్కల పెంపకంపై విద్యార్థులకు ప్రాజెక్ట్‌ వర్క్క్స కింద 5 మార్కులు ఇస్తామని చెప్పారు. ఆగస్టున 15న మొక్కలను సంరక్షించిన పాధ్యాయులకు క్యాష్‌ బహుమతులతో పాటు హరితమిత్ర అవార్డును అందిస్తామని డీఈఓ చెప్పారు.
పాఠశాలలకు 1412 వంట గదులు మంజూరు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వంటకు ఇ ఇబ్బందులు లేకుండా 1412 వంట గదులు మంజూరు చేసినట్టు డీఈఓ చెప్పారు. ఇందులో 100 మందిలోపు విద్యార్థులున్న దానికి రూ. 1.36లక్షలు, 101 నుంచి 200 మంది విద్యార్థులుంటే రూ. 1.86 లక్షలు, 201 నుండి 500 మంది విద్యార్థులుంటే రూ. 2.75 లక్షలు, 500పైన ఉంటే 3.35 లక్షలు ఖర్చు చేస్తాన్నారు.
1498 మంది విద్యావలంటీర్ల నియామకం
 ప్రస్తుతం 1498 మంది విద్యావలంటీర్లను నియమించినట్టు డీఘో రమేష్ తెలిపారు. పాఠశాల ప్రారంభ సమయంలో ఉన్న 274 మంది విద్యావలంటీర్లను కలుపుకుని కొత్తగా 1224 మందిని భర్తీ చేశామన్నారు. ఎక్కువగా బషీరాబాద్‌ మండలంలో 112 మంది, మర్పల్లి మండలంలో 98 మంది విద్యావలంటీర్లను నియమించినట్టు చెప్పారు. జిల్లాలోని             595 పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభించామన్నారు. ఉపాధ్యాయులు ఇతర బిజినెన్స్‌లు చేయకూడదని ఆదేశాలు ఉన్నాయన్నారు. అనంతరం ధన్నారంలోని ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ హరిశ్చందర్, ఎంఈఓ గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement