27 నుంచి నిరుద్యోగులకు ఉచిత శిక్షణ | free training for unemployees | Sakshi
Sakshi News home page

27 నుంచి నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

Mar 25 2017 11:48 PM | Updated on Sep 5 2017 7:04 AM

గ్రామీణ నిరుద్యోగ యువతకు ఈ నెల 27వ తేదీ నుంచి ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ వై. రామకృష్ణ శనివారం ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(హాస్పిటల్‌): గ్రామీణ నిరుద్యోగ యువతకు ఈ నెల 27వ తేదీ నుంచి ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ వై. రామకృష్ణ శనివారం ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా యువతకు మూడు నెలల పాటు ఇంగ్లిష్, పని సంసిద్ధత, కంప్యూటర్‌ శిక్షణా కార్యక్రమాన్ని స్థానిక బి.తాండ్రపాడులోని టీటీడీసీలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు చూపిస్తామన్నారు. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండి, ఎస్‌ఎస్‌సీ/ఇంటర్‌ పాస్,ఫెయిలైన యువతీయువకులు అర్హులన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల వారు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డుతో ఈ నెల 27, 28వ తేదీల్లో టీటీడీసీలో అడ్మిషన్‌ పొందాలన్నారు. వివరాలకు కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ–ఈజీఎం కార్యాలయం, ఫోన్‌ నెం.9866179471, 9885127745, 9966723684, 08518277499 నంబర్లకు సంప్రదించాలని కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement