ఈతకెళ్లి నలుగురి మునక.. | four men submerged in water | Sakshi
Sakshi News home page

ఈతకెళ్లి నలుగురి మునక..

Aug 7 2016 3:50 PM | Updated on Sep 4 2017 8:17 AM

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి వద్ద ఉన్న వైరా ఏటిలో ఈతకెళ్లిన నలుగురు బాలలు మునిగిపోయారు.

- ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం
కంచికచర్ల(కృష్ణా జిల్లా)

 కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి వద్ద ఉన్న వైరా ఏటిలో ఈతకెళ్లిన నలుగురు బాలలు మునిగిపోయారు. వారిలో భరణి(16)అనే బాలుడు మృతిచెందగా తమ్మి(16) అనే బాలుని పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గండేపల్లికి చెందిన నలుగురు బాలలు ఆదివారం మధ్యాహ్నం ఈతకు వెళ్లారు. ప్రమాద వశాత్తూ ఏటిలో మునిగిపోయారు. గట్టున ఉన్న స్థానికులు వెంటనే ముగ్గురిని కాపాడగలిగారు. భరణి మృతిచెందగా సురక్షితంగా బయటపడిన తమ్మి పరిస్థితి విషమంగా ఉండడంతో కంచికచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement