కారు బోల్తా, నలుగురు దుర్మరణం | four killed mahabubnagar road accident | Sakshi
Sakshi News home page

కారు బోల్తా, నలుగురు దుర్మరణం

Jun 25 2016 4:36 PM | Updated on Sep 4 2017 3:23 AM

మహబూబ్నగర్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డిపల్లి హైవేపై ఓ కారు ..

మహబూబ్నగర్ : పాలమూరు జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనటంతో చిన్నారి సహా నలుగురు మృత్యువాత పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం మేడిపల్లి వద్ద శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

హైదరాబాద్ వైపు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు మేడిపల్లి వద్ద రోడ్డు పక్కనున్న కల్వర్టును వేగంగా డీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. అందులో ఉన్న ఒక చిన్నారితోపాటు ఇద్దరు పురుషులు, ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయారు. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి కారులోనే ఇరుక్కున్నాడు. అతడిని పోలీసులు రక్షించేందుకు యత్నిస్తున్నారు. బాధితులను శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పామిరెడ్డిపాడు గ్రామానికి చెందిన అచ్చెంనాయుడు, భారతి, చిన్నారి యశస్విని కాగా మరొకరు కారు డ్రైవర్. కారు డ్రైవర్‌తోపాటు తీవ్రంగా గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement