'యనమల ఒక చవట.. దద్దమ్మ' | Former MP Harsha kumar slams Yanamala ramakrishnudu | Sakshi
Sakshi News home page

'యనమల ఒక చవట.. దద్దమ్మ'

Feb 19 2016 8:09 PM | Updated on Aug 27 2018 8:44 PM

'యనమల ఒక చవట.. దద్దమ్మ' - Sakshi

'యనమల ఒక చవట.. దద్దమ్మ'

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుపై కాంగ్రెస్‌ మాజీ ఎంపీ హర్షకుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుపై కాంగ్రెస్‌ మాజీ ఎంపీ హర్షకుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యనమల ఒక చవట.. దద్దమ్మ' అంటూ ధ్వజమెత్తారు. శుక్రవారం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. యనమల వల్లే పెట్రోలియం యూనివర్సిటీ వైజాగ్‌ తరలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇసుకపైనే ఆసక్తి చూపిస్తున్నారని దుయ్యబట్టారు. వీళ్లు ప్రజా ప్రతినిధులా? ఇసుక వ్యాపారులా? అంటూ మాజీ ఎంపీ హర్షకుమార్‌ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement