అప్పన్న సన్నిధిలో విదేశీ బృందం | Foreigners worshiped at Simhagiri | Sakshi
Sakshi News home page

అప్పన్న సన్నిధిలో విదేశీ బృందం

Aug 30 2016 11:16 PM | Updated on Oct 4 2018 7:01 PM

అప్పన్న సన్నిధిలో విదేశీ బృందం - Sakshi

అప్పన్న సన్నిధిలో విదేశీ బృందం

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం విదేశీ అధికార బృందం దర్శించుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న గ్రామీణావృద్ధిని పరిశీలించేందుకు పలు దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు రాష్రీ్టయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ రజనీకాంత్‌ ఆధ్వర్యంలో తరలివచ్చారు.

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం విదేశీ అధికార బృందం దర్శించుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న గ్రామీణావృద్ధిని పరిశీలించేందుకు పలు దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు రాష్రీ్టయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ రజనీకాంత్‌ ఆధ్వర్యంలో తరలివచ్చారు. కప్పసం్తభాన్ని ఆలింగనం చేసుకుని బేడాచుట్టూ ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో అషో్టత్తరంపూజ, గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చనలు నిర్వహించారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. 
 
హుండీఆదాయం రూ.99.52 లక్షలు
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి హుండీ ఆదాయం గడిచిన 29 రోజులకు రూ. 99 ,52, 490  వచ్చినట్టు సింహాచలం దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్‌ తెలిపారు. నగదుతోపాటు 125 గ్రాముల బంగారం,  8 కిలోల 750 గ్రాముల వెండి  వచ్చినట్టు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన లెక్కింపులో దేవస్థానం అధికారులు, సిబ్బంది, శ్రీహరి స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement