ప్రై వేట్‌ విద్యార్థులకు ప్రత్యేక వార్షిక ఉమ్మడి పరీక్ష | for private students special common year test | Sakshi
Sakshi News home page

ప్రై వేట్‌ విద్యార్థులకు ప్రత్యేక వార్షిక ఉమ్మడి పరీక్ష

Jul 26 2016 8:34 PM | Updated on Jul 12 2019 4:35 PM

ఏలూరు సిటీ : పదో తరగతి పరీక్షలు సీసీఈ విధానంలో నిర్వహించనున్న నేపథ్యంలో ప్రై వేట్‌ పాఠశాలల్లో విద్యార్థులు ప్రత్యేక వార్షిక ఉమ్మడి పరీక్ష రాయాల్సి ఉంటుందని డీఈవో డి.మధుసూదనరావు తెలిపారు.

ఏలూరు సిటీ : పదో తరగతి పరీక్షలు సీసీఈ విధానంలో నిర్వహించనున్న నేపథ్యంలో ప్రై వేట్‌ పాఠశాలల్లో విద్యార్థులు ప్రత్యేక వార్షిక ఉమ్మడి పరీక్ష రాయాల్సి ఉంటుందని డీఈవో డి.మధుసూదనరావు తెలిపారు. 9వ తరగతి ప్రవేÔ¶  పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆగస్టు 31 నాటికి 13 ఏళ్లు, 10వ తరగతి ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు 14 ఏళ్లు నిండి ఉండాలన్నారు. పరీక్షల ప్రశ్నపత్రం 50 మార్కులకు సీసీఈ విధానంలో ఉంటుందన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. 
–వచ్చేనెల 16న ఉదయం తెలుగు, మధ్యాహ్నం గణితం, వచ్చేనెల 17న ఉదయం హిందీ, మధ్యాహ్నం భౌతికశాస్త్రం, వచ్చేనెల 18న ఉదయం ఇంగ్లిష్, మధ్యాహ్నం జీవశాస్త్రం, వచ్చేనెల 19న ఉదయం సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలు. ఏలూరు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, కొవ్వూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తాడేపల్లిగూడెం, తణుకు జెడ్పీ హైస్కూళ్లు, భీమవరం పీఎస్‌ఎం బాలికల ఉన్నత పాఠశాల, పాలకొల్లు యంయంకేఎన్‌ మునిసిపల్‌ ఉన్నత పాఠశాలల్లోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు దరఖాస్తులను ఈ పరీక్షా కేంద్రాల నుంచి ఉచితంగా పొందవచ్చు. రూ.700ల డీడీని కార్యదర్శి, జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ, పశ్చిమగోదావరి, ఏలూరు పేరుతో తీసుకుని ఆగస్టు 2వ తేదీలోగా సంబంధిత పరీక్షా కేంద్రాల ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తులు అందజేయాలని డీఈవో వివరించారు. 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement