క్రీడాకారులకు టీఏ, డీఏ అందించాలి | for playears have to given ta,da | Sakshi
Sakshi News home page

క్రీడాకారులకు టీఏ, డీఏ అందించాలి

Jul 29 2016 10:27 PM | Updated on Sep 4 2017 6:57 AM

ఏలూరు రూరల్‌ : జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీసి శిక్షణ ఇవ్వాలని జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ సభ్యులు కోరారు.

ఏలూరు రూరల్‌ :  జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీసి శిక్షణ ఇవ్వాలని జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ సభ్యులు కోరారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్‌ఏ అజీజ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన అసోసియేషన్‌ చైర్మన్‌ బడేటి వెంకట్రామయ్య మాట్లాడుతూ వివిధ పోటీలకు వెళ్లే క్రీడాకారులకు టీఏ, డీఏ చెల్లించాలని సూచించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధి, మౌళిక వసతులు కల్పనపై త్వరలో కలెక్టర్‌ సమక్షంలో వివిధ క్రీడా సంఘాల ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని సభ్యులు కోరారు. పలువురు సభ్యులు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement