ఫ్లెక్సీల్లోనూ వివక్ష | flex controverse in hindupur | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సీల్లోనూ వివక్ష

Sep 18 2016 12:15 AM | Updated on Oct 2 2018 7:28 PM

ఫ్లెక్సీల్లోనూ వివక్ష - Sakshi

ఫ్లెక్సీల్లోనూ వివక్ష

హిందూపురం పురపాలక సంఘంలో అధికార పార్టీకి ఓ న్యాయం, ప్రతిపక్ష పార్టీలకు మరో న్యాయం జరుగుతోంది.

హిందూపురం టౌన్‌ : హిందూపురం పురపాలక సంఘంలో అధికార పార్టీకి ఓ న్యాయం, ప్రతిపక్ష పార్టీలకు మరో న్యాయం జరుగుతోంది. దీనికి నిదర్శనం ఇందిరమ్మ సర్కిల్‌లోని టీడీపీకి చెందిన వారి ఫ్లెక్సీలే. వాటిని అధికారులు తొలగించాల్సి ఉంది. అయితే కేవలం వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు మాత్రమే తొలగించి టీడీపీ నాయకుల ఫ్లెక్సీలను అలాగే వదిలేశారు.

ఈ ఫ్లెక్సీలు ఆస్పత్రికి వెళ్లే వారికి ఇబ్బంది కలిగిస్తున్నా తొలగించకపోవడం గమనార్హం. ఈ విషయంపై పట్టణ ప్రణాళిక అధికారి తులసీరాంను అడగ్గా రెండు నెలలుగా స్మార్ట్‌ పల్స్‌ సర్వేలో బిజీగా ఉన్నామని చెప్పారు. కాగా అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీలకు పురపాలికకు శిస్తు చెల్లించడం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement