చిత్తూరులో వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం | fire mishap in Kumarn silks in chittoor | Sakshi
Sakshi News home page

చిత్తూరులో వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం

Mar 14 2016 12:32 PM | Updated on Sep 13 2018 5:04 PM

చిత్తూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న కుమరన్ శిల్క్స్ వస్త్ర దుకాణంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది.

- ఎగిసిపడుతున్న మంటలు
చిత్తూరు: చిత్తూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న కుమరన్ శిల్క్స్ వస్త్ర దుకాణంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. వస్త్ర దుకాణంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు అకస్మాత్తుగా చెలరేగడంతో దుకాణంలోని సిబ్బంది వీధిలోకి పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దుకాణంలోని వస్త్రాలు కాలి బూడిదవుతున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement