ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య | Financial difficulties commit to suicide | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Jul 20 2016 7:23 PM | Updated on Nov 6 2018 7:56 PM

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని మందిపల్‌ గ్రామంలో చోటు చేసుకుంది.

కుల్కచర్ల: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని మందిపల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటయ్య(32) స్థానికంగా వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసైన ఆయన ఖాళీగా తిరుగుతూ పనిచేయడం లేదు. ఈనేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. మంగళవారం మద్యం తాగిన వెంకటయ్య ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ని‍ప్పంటించుకున్నాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి బుధవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడికి భార్య జ్యోతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటయ్య తండ్రి అనంతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్‌గౌడ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement