మండలంలోని రావురూకుల గ్రామానికి చెందిన నీరడి సత్తవ్వ ఆనారోగ్యంతో మృతి చెందడంతో మంత్రి హరీశ్‌రావు రూ. 5 వేలు ఆర్థిక సహాయాన్ని మంగళవారం గ్రామ నాయకులు అల్లం కిషన్ చేతుల మీదుగా మృతురాలి భర్త ఎల్లయ్యకు అందజేశారు.
సిద్దిపేట రూరల్: మండలంలోని రావురూకుల గ్రామానికి చెందిన నీరడి సత్తవ్వ ఆనారోగ్యంతో మృతి చెందడంతో మంత్రి హరీశ్‌రావు రూ. 5 వేలు ఆర్థిక సహాయాన్ని మంగళవారం గ్రామ నాయకులు అల్లం కిషన్ చేతుల మీదుగా మృతురాలి భర్త ఎల్లయ్యకు అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన సత్తవ్వకు అంత్యక్రియలకు కూడా డబ్బులు లేకపోవడంతో గ్రామ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి, ఆర్థిక సహాయం చేశారు. దీంతో మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు శ్రీధర్‌రెడ్డి, రాజయ్య, నీరడి రవీందర్, పోచయ్య, దుర్గయ్య, గ్రామ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నీరడి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.