స్వల్పంగా తగ్గిన ఎరువుల ధరలు | fertilizer prices lightly reduced | Sakshi
Sakshi News home page

స్వల్పంగా తగ్గిన ఎరువుల ధరలు

Jul 6 2017 11:02 PM | Updated on Jul 6 2019 3:20 PM

జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) ప్రభావంతో రసాయన ఎరువుల ధరలు కొంతమేర తగ్గాయి.

కర్నూలు(అగ్రికల్చర్‌): జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) ప్రభావంతో రసాయన ఎరువుల ధరలు కొంతమేర తగ్గాయి. మొన్నటి వరకు 50 కిలోల యూరియా బస్తా ధర రూ.298 ఉంది. జీఎస్టీతో మూడు రూపాయలు తగ్గి.. రూ.295 వద్ద స్థిరపడింది. అలాగే కోరమాండల్‌ కంపెనీకి చెందిన డీఏపీ ధర రూ.1092 ఉండగా ప్రస్తుతం రూ.1081కి తగ్గింది. 10.26.26 బస్తా ధర రూ.1155 ఉండగా 1044కు తగ్గింది. 28.28.0, 14.35.14 బస్తా ధర రూ.1134 నుంచి రూ.1122కు తగ్గింది. 20.20.0.13 బస్తా ధర రూ,829 నుంచి రూ.821కి తగ్గింది. ఎంఓపీ ధర రూ. 577 నుంచి రూ. 575కు తగ్గింది. 
 
  •  ఎంసీఎఫ్‌ఎల్‌కు చెందిన డీఏపీ ధర మొన్నటి వరకు రూ. 1118 ఉండగా 1105కు తగ్గింది. 20.20.0.13 ధర రూ.883 నుంచి రూ.872కు తగ్గింది. క్రిబ్‌కొ డీఏపీ ధర రూ.1086 ఉండగా రూ.1076కు తగ్గింది. ఎంఓపీ ధర రూ.583.25 నుంచి 577.50కి తగ్గింది.
  •  పీపీఎల్‌ కంపెనీ డీఏపీ ధర రూ.1118 నుంచి 1105కు తగ్గింది. 10.26.26 ధర రూ.1082 ఉండగా రూ.1076కు తగ్గింది. 20.20.0.13 ధర రూ.882 నుంచి రూ.872కు తగ్గింది.  
  •  జువారి కంపెనీకి చెందిన డీఏపీ బస్తా ధర రూ.1123 నుంచి రూ.1105కు, 19.19.19 ధర రూ1081 నుంచి 1071కి, ఎంఓపీ ధర రూ.580 నుంచి రూ.579కి తగ్గాయి. 
  •  మద్రాసు పర్టిలైజర్స్‌ లిమిటెడ్‌కు చెందిన 17.17.17 బస్తా ధర రూ.రూ.998 నుంచి 989.50కి తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement