‘బొబ్బర’తో బెంబేలు

:పంటకు మందు కొడుతున్న రైతు


మధిర: మిరపతోటల్లో ఇటీవల బొబ్బర తెగులు తీవ్రంగా వ్యాపిస్తోంది. జెమినీ వైరస్‌ ఆశించి పంట ఎదుగుదలను చంపేస్తోంది. ఆకులపై బొబ్బలు ఏర్పడి, పత్రాలన్నీ పసుపు రంగులోకి మారుతున్నాయి. తెల్లదోమ ఆశించడంవల్లే ఈ విధంగా జరుగుతోందని రైతులు వాపోతున్నారు. దీని నివారణ కోసం రైతులు క్రిమి సంహారక మందుల పిచికారీకి ఇప్పటికే ఎకరానికి రూ.20వేలకు పైగా ఖర్చుపెట్టారు. దీనికి తోడు మిరపతోటకు వివిధ రకాల చీడపీడలు, దోమ ఆశిస్తుండడంతో మిరపతోటల ఎదుగుదల లోపిస్తోంది. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ ఈ బొబ్బరరోగం నివారణకు పురుగుమందులను పిచికారీ చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మధిర మండల పరిధిలోని నిదానపురం గ్రామంలో మిరప తోటల్లో ఈ తెగుళ్ల పీడ తీవ్రంగా ఉంది. పలు గ్రామాల్లో జెమినీ వైరస్‌ వ్యాపిస్తోంది. పంట వాడిపోయినట్లు మారిపోతుండడంతో వేలాది రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు దిగాలు చెందుతున్నారు.  

ఆశలు ఆవిరి..

l    ఖరీఫ్‌లో ఎన్నో ఆశలతో మిర్చి పంట వేసిన రైతులు ఇప్పుడు తెగుళ్లతో బెంబేలెత్తుతున్నారు.  

l    బొబ్బర తెగులుతో ఆకులన్నీ రోజుల వ్యవధిలోనే రంగు మారి పాలిపోతుంటే గుండెధైర్యం కోల్పోతున్నారు.  

l    పచ్చగా నిగనిగలాడాల్సిన తోట..పాలిపోతోంది.

l    ఈ తెగుళ్ల నివారణకు ఇంకా పురుగులమందు పిచికారీ భారం పడే అవకాశాలు ఉన్నాయి.  

l    బొబ్బర తెగుâýæ్ల పంటలను వ్యవసాయాధికారులు పరిశీలించాలని రైతులు కోరుతున్నారు.  

l    బోర్లు, బావులను అద్దెకు తీసుకొని, జనరేటర్లు, డీజిలింజన్ల ద్వారా మొన్నటిదాకా తడులు కట్టారు.  

l    ఇప్పుడు తెగుâýæ్లతో పంట చేతికందకుంటే.. నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి..  

ఖరీఫ్‌లో ఎకరం భూమిని కౌలుకు తీసుకొని మిర్చిపంట వేశా. బొబ్బర రోగం వచ్చి ఆకులన్నీ ముడుచుకుపోతున్నాయి. పసుపు రంగులోకి మారుతున్నాయి. కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వమే రుణాలు మంజూరు చేయాలి. ఈ సారి పెట్టుబడి ఎకరానికి రూ.2లక్షలకుపైగా అవుతుందేమోనని భయపడుతున్నాం. ప్రైవేట్‌ వ్యాపారులు దోచుకుంటున్నారు.    

–తిప్పారెడ్డి శ్రీనివాసరెడ్డి,

మిరప రైతు, నిదానపురం

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top