'9999' నంబర్‌ కావాలంటే.. | fancy number auction in krishna district | Sakshi
Sakshi News home page

'9999' నంబర్‌ కావాలంటే..

Aug 7 2015 6:40 PM | Updated on Sep 3 2017 6:59 AM

'9999' నంబర్‌ కావాలంటే..

'9999' నంబర్‌ కావాలంటే..

వాహన ప్రియులకు ఫ్యాన్సీ నంబర్లపై మోజు ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి నిరూపితమైంది.

రూ.7,39,999 చెల్లించాల్సిందే!

ఉయ్యూరు (కృష్ణా జిల్లా): వాహన ప్రియులకు ఫ్యాన్సీ నంబర్లపై మోజు ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి నిరూపితమైంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రాంతీయ రవాణా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వేలంలో 9999 నంబర్‌కు రికార్డు స్థాయిలో ధర పలికింది. ఉయ్యూరు మండలం రాజుపేటకు చెందిన సీహెచ్.వెంకటేశ్వర్లు రాజు, డి.సునీత రూ.50 వేల చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి 9999 నంబరు కోసం పోటీ పడ్డారు.

దీంతో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శివకామేశ్వరరావు వేలం నిర్వహించారు. సునీత రూ.6,63,000కు డీడీ ఇవ్వగా, వెంకటేశ్వర్లు రాజు రూ.7,39,999కు డీడీ ఇచ్చారు. దీంతో అత్యధికంగా డీడీ చెల్లించిన వెంకటేశ్వర్లు రాజుకు 9999 నంబర్ కేటాయించినట్లు ఎంవీఐ ప్రకటించారు. రాజు తన ఫార్చ్యూనర్ కారుకు ఈ నంబర్ కోసం ప్రయత్నించారని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement