మూర్ఛ రోగులు ఒంటరిగా ఉండరాదు | epilepsy Patients should not be alone | Sakshi
Sakshi News home page

మూర్ఛ రోగులు ఒంటరిగా ఉండరాదు

Jul 18 2016 6:25 PM | Updated on Oct 9 2018 7:52 PM

మూర్ఛ రోగులు వంట, ఈత, ప్రయాణం, ఎల్తైన ప్రదేశాల్లో ఒంటరిగా ఉండరాదని ప్రముఖ న్యూరాలజిస్ట్‌ డా.గోపాలం శివన్నారాయణ అన్నారు.

మూర్ఛ రోగులు వంట, ఈత, ప్రయాణం, ఎల్తైన  ప్రదేశాల్లో ఒంటరిగా ఉండరాదని ప్రముఖ న్యూరాలజిస్ట్‌ డా.గోపాలం శివన్నారాయణ అన్నారు. జన విజ్ఞానవేదిక, కదిరి శాఖ సీఆర్‌సీలో మూర్ఛ రోగులకు నిర్వహించిన వైద్య శిబిరానికి ఆయన హాజరై రోగులను పరీక్షించారు.
 
రాయచోటి, పులివెందుల, కర్ణాటక, మొలకల చెరువు నుంచి సుమారు 160 మంది హాజరయ్యారు. మళ్లీ వైద్యశిబిరం సెప్టెంబర్‌ 18న జరుగుతుందని, జేవీవీ జిల్లా కోశాధికారి బీ.నరసారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జేవీవీ ఉపాధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేంద్రరెడ్డి, సబ్‌ యూనిట్‌ మలేరియా సూపర్‌వైజర్‌ మహబూబ్‌బాషా పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement