నిశ్చితార్థంను అడ్డుకున్న అధికారులు | engagement | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థంను అడ్డుకున్న అధికారులు

Oct 19 2016 11:03 PM | Updated on Sep 4 2017 5:42 PM

మండలంలోని పడగల్‌ ఒడ్డెర కాలనీలో బుధవారం బాల్యవివాహానికి సంబంధించి నిశ్చితార్థంను ఐసీడీఎస్‌ అధికారులు అడ్డుకున్నారు. ఒడ్డెర కాలనీకి చెందిన మల్లయ్య, లక్ష్మీ దంపతుల

 
పడగల్‌ ఒడ్డెరకాలనీ (వేల్పూర్‌) :
మండలంలోని పడగల్‌ ఒడ్డెర కాలనీలో బుధవారం బాల్యవివాహానికి సంబంధించి నిశ్చితార్థంను ఐసీడీఎస్‌ అధికారులు అడ్డుకున్నారు. ఒడ్డెర కాలనీకి చెందిన మల్లయ్య, లక్ష్మీ దంపతుల మైనర్‌ కూతురు మంజులకు, భీమ్‌గల్‌ మండలం మెండోరాకు చెందిన 23 ఏళ్ల సంజీవ్‌తో నిశ్చితార్థం చేస్తున్నారన్న సమాచారంతో ఐసీడీఎస్‌ సీడీపీవో సుధారాణి, సూపర్‌వైజర్‌ నీరజ అక్కడికి చేరుకున్నారు. అమ్మాయికి 18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని, 2 సంవత్సరాల జైలు, రూ. 50 వేల జరిమానా ఉంటుందని అబ్బాయి తల్లిదండ్రులు వెంకట్, ముత్తెమ్మ, అమ్మాయి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. దీంతో నిశ్చితార్థం ఆపేశారు. అమ్మాయికి 18 ఏళ్లు నిండేదాక పెళ్లి చేయమని సీడీపీవోకు హామీపత్రం ఇచ్చారు. పడగల్‌ వీఆర్వో బండన్న, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement