మండలంలోని వన్నెల్ కే గ్రామంలోని శ్రీమన్నారాయణ ఆలయంలో గురువారం రాత్రి దుండగులు
ఆలయంలో చోరీ
Sep 2 2016 9:16 PM | Updated on Oct 17 2018 5:37 PM
నందిపేట : మండలంలోని వన్నెల్ కే గ్రామంలోని శ్రీమన్నారాయణ ఆలయంలో గురువారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై జాన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయ పూజారి నరేశ్ శర్మ గురువారం రాత్రి ఆలయంలో పూజలు చేసిన అనంతరం గుడిని మూసివేసి ఇంటికి వెళ్లాడు. తిరిగి శుక్రవారం ఉదయం వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో గ్రామస్తులకు సమాచారం అందించాడు. ఆలయంలో హుండీలో గల నగదుతో పాటు సీతమ్మ విగ్రహం మెడలో గల నాలుగు మాసాల బంగారు పుస్తెల తాడు చోరీకి గురైంది. ఆలయ చైర్మన్ దేగాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement