'ఈవోనని చెప్పినా పట్టించుకోలేదు' | Durga Temple EO suryakumari takes on vijayawada police | Sakshi
Sakshi News home page

'ఈవోనని చెప్పినా పట్టించుకోలేదు'

Aug 13 2016 11:28 AM | Updated on Sep 29 2018 5:55 PM

'ఈవోనని చెప్పినా పట్టించుకోలేదు' - Sakshi

'ఈవోనని చెప్పినా పట్టించుకోలేదు'

దుర్గ గుడి వద్ద పోలీసులు శనివారం అత్యుత్సహం ప్రదర్శించారు.

విజయవాడ : దుర్గ గుడి వద్ద పోలీసులు శనివారం అత్యుత్సహం ప్రదర్శించారు. ఇంద్రకీలాద్రి కొండపైకి అనుమతి లేదంటూ దేవాలయ ఈవో సూర్యకుమారి, ప్రధాన అర్చకులు శివప్రసాద్ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా కొండపైకి నడిచి వెళ్లాలని వారికి పోలీసులు సూచించారు. తాను దేవాలయం ఈవోనని సూర్యకుమారి  పోలీసులకు చెప్పింది.

అయినా ఆమె మాటలను వారు పట్టించుకోలేదు. అయితే దేవాలయం ఆధికారుల సమక్షంలోనే వీఐపీల వాహనాలకు కొండపైకి అనుమతించారు. పోలీసుల తీరుపై ఆలయ అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఈవో సూర్యకుమారితోపాటు ఆలయ సిబ్బంది సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సమయత్తమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement