డీటీలకు డెప్యుటేషన్‌ | dt are deputaion | Sakshi
Sakshi News home page

డీటీలకు డెప్యుటేషన్‌

Jun 29 2017 10:26 PM | Updated on Sep 5 2017 2:46 PM

రెవెన్యూశాఖలో ఐదుగురు డిప్యూటీ తహసీల్దార్లను డెప్యుటేషన్‌పై నియమిస్తూ కలెక్టర్‌ ఈనెల 28న ఉత్తర్వులను జారీ చేశారు.

అనంతపురం అర్బన్‌ : రెవెన్యూశాఖలో ఐదుగురు డిప్యూటీ తహసీల్దార్లను డెప్యుటేషన్‌పై నియమిస్తూ కలెక్టర్‌ ఈనెల 28న ఉత్తర్వులను జారీ చేశారు. ఎన్‌పీకుంట సీఎస్‌డీటీగా ఉన్న (ప్రస్తుతం సెలవులో) జి.ప్రమీలని అనంతపురం ఆర్‌డీఓ కార్యాలయంలో నియమించారు. ఆత్మకూరు సీఎస్‌డీటీ డి.నాగరాజారావును అనంతపురం తహసీల్దారు కార్యాలయం సీఎస్‌డీటీ–1గా నియమించారు. అనంతపురం తహసీల్దార్‌ కార్యాలయంలో సీఎస్‌డీటీ–1గా ఉన్న వెంకటేశ్‌కుమార్ , పెనుకొండ సీఎస్‌డీటీ–2గా ఉన్న కె.మనోహర్‌కుమార్, పెద్దపప్పూరు సీఎస్‌డీటీగా ఉన్న ఎన్‌.ఎం.బాషాని అనంతపురం ఆర్‌డీఓ కార్యాలయంలో డెప్యుటేషన్‌పై నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement