కరీంనగర్ కార్పొరేషన్ : నగర శివారు డివిజన్లలో సైతం మట్టి రోడ్లు కనిపించకుండా చేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం నగరంలోని 5వ డివిజన్ కిసాన్‌నగర్‌లో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.18లక్షలతో చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
-
ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ కార్పొరేషన్ : నగర శివారు డివిజన్లలో సైతం మట్టి రోడ్లు కనిపించకుండా చేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం నగరంలోని 5వ డివిజన్ కిసాన్‌నగర్‌లో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.18లక్షలతో చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరం స్మార్ట్‌సిటీ గాæ అవతరించబోతోందని, అందుకుతగ్గట్టుగానే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రధాన రహదారులన్నీ సుందరీకరణను సంతరించుకుంటున్నాయన్నారు. రోడ్ల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. మేయర్ రవీందర్‌సింగ్, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, ఆరిఫ్, లంక రవీందర్, బోనాల శ్రీకాంత్, ఏవీ రమణ, బండారి వేణు, నాయకులు కట్ల సతీశ్, చల్ల హరిశంకర్, పెండ్యాల మహేశ్, సాంబయ్య, అజయ్, శ్రవణ్, సుల్తానా, రాజు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.