నెల్లూరు(బృందావనం): ఫతేఖాన్‌పేట అరిగెలవారివీధిలో శనివారం పిచ్చికుక్క కరిచి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
పిచ్చికుక్క కరిచి ముగ్గురికి తీవ్రగాయాలు
Jul 30 2016 6:55 PM | Updated on Sep 29 2018 4:26 PM
నెల్లూరు(బృందావనం): ఫతేఖాన్‌పేట అరిగెలవారివీధిలో శనివారం పిచ్చికుక్క కరిచి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. పది నిమిషాల వ్యవధిలో పాఠశాలలకు వెళ్తున్న ఏడేళ్ల బాలిక వైష్ణవి, పన్నెండేళ్ల బాలిక నాగశర్వాణి, విధులకు వెళ్తున్న హరీష్‌ను కరిచి గాయపర్చింది. ఫతేఖాన్‌పేటలోని పలు వీధుల్లో సైతం శుక్రవారం మరో ముగ్గుర్ని కరిచినట్లు బంధువులు తెలిపారు. బాధితులు రెడ్‌క్రాస్, ప్రైవేట్ ఆస్పత్రులకు ఆశ్రయించారు. ఫతేఖాన్‌పేట, అరిగెలవారివీధి, సకిలంవారివీధి, రైతు బజార్‌సెంటర్, పాత పోలీస్ క్వార్టర్స్, రాగిచెట్టు సెంటర్ ప్రాంతాల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement