ఆత్మకూరురూరల్ : కార్పొరేట్ ఆస్పత్రుల్లో నయం జబ్బును ప్రభుత్వాస్పత్రి వైద్యులు నయంచేశారు.
రెండేళ్ల కష్టం.. మూడురోజుల్లో నయం
Aug 2 2016 11:37 PM | Updated on Sep 4 2017 7:30 AM
ఆత్మకూరురూరల్ : కార్పొరేట్ ఆస్పత్రుల్లో నయం జబ్బును ప్రభుత్వాస్పత్రి వైద్యులు నయంచేశారు. వివరాలు.. కలువాయి మండలం తోపుగుంట గ్రామానికి చెందిన అన్నెపోగు సుబ్బరత్నమ్మ రెండేళ్లుగా కాళ్లు, చేతుల నొప్పులతో బాధపడుతుండేది. స్థానిక ఆస్పత్రులతో పాటు నెల్లూరులో కార్పొరేట్ వైద్యశాలలో చూపించుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయిన రత్నమ్మ దిగులుపడి నాలుగురోజుల క్రితం అపస్మారక స్థితికి వెళ్లిన ఆమెను బంధువులు ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. డాక్టర్ ఎన్.విజయభాస్కర్‌రెడ్డి ఆమె రోగాన్ని పరిశీలించారు. సాధారణంగా ప్రతి మనిషికి 3.5 నుంచి 5 ఎంఈక్యూ (మిల్లీ ఈక్వలెంట్) పొటాషియం లెవెల్స్ ఉండాలని, ఆమెకు కేవలం ఒక ఎంఈక్యూ మాత్రమే ఉందని నిర్ధారించి మందులు ఇచ్చి మూడురోజుల్లోనే జబ్బును తగ్గించారు.
Advertisement
Advertisement