కరాటే జిల్లా జట్టు ఎంపిక | District karate team selected | Sakshi
Sakshi News home page

కరాటే జిల్లా జట్టు ఎంపిక

Sep 6 2016 10:39 PM | Updated on Sep 4 2017 12:26 PM

కరాటే జిల్లా జట్టు ఎంపిక

కరాటే జిల్లా జట్టు ఎంపిక

జిల్లా స్థాయి కరాటే పోటీలు ఈనెల 4, 5తేదీల్లో బాపట్లలో ఉంతో ఉత్కంఠభరితంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి 100 మంది ఈపోటీల్లో పాల్గొనగా 15మందిని రాష్ట్రజట్టుకు ఎంపిక చేశారు.

బాపట్ల టౌన్‌:  జిల్లా స్థాయి కరాటే పోటీలు ఈనెల 4, 5తేదీల్లో బాపట్లలో ఉంతో ఉత్కంఠభరితంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి 100 మంది ఈపోటీల్లో  పాల్గొనగా 15మందిని రాష్ట్రజట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన వారిలో సిహెచ్‌ హర్ష, కె.పృధ్వీ, కె.కళ్యాణ్, సిహెచ్‌ పవన్, టి.సంతోష్, బి.రామకోటి, తేజ, కె.కారుణ్య, బి.ఎన్‌.వి.శ్రీలక్ష్మీ, డి.హర్ష, కార్తీకేయ, బి.సాయిమోహన్, కె.ధనుజయ్, డి.తరుణ్, కె.సత్య ఉన్నారు. ఈమేరకు మంగళవారం స్థానిక రోటరీక్లబ్‌లో జిల్లా కరాటే అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపికైన వారిని అభినందించింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ నాయకులు యర్రా నాగేశ్వరరావు, తిరుపతిరావు, రుద్రరాజు అంజిరాజు, రోటరీక్లబ్‌ ప్రెసిడెంట్‌ సురేష్, ఇంటర్నేషనల్‌ కరాటే నిపుణులు కొండ్ర కీరన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement