breaking news
dist team
-
కరాటే జిల్లా జట్టు ఎంపిక
బాపట్ల టౌన్: జిల్లా స్థాయి కరాటే పోటీలు ఈనెల 4, 5తేదీల్లో బాపట్లలో ఉంతో ఉత్కంఠభరితంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి 100 మంది ఈపోటీల్లో పాల్గొనగా 15మందిని రాష్ట్రజట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన వారిలో సిహెచ్ హర్ష, కె.పృధ్వీ, కె.కళ్యాణ్, సిహెచ్ పవన్, టి.సంతోష్, బి.రామకోటి, తేజ, కె.కారుణ్య, బి.ఎన్.వి.శ్రీలక్ష్మీ, డి.హర్ష, కార్తీకేయ, బి.సాయిమోహన్, కె.ధనుజయ్, డి.తరుణ్, కె.సత్య ఉన్నారు. ఈమేరకు మంగళవారం స్థానిక రోటరీక్లబ్లో జిల్లా కరాటే అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపికైన వారిని అభినందించింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు యర్రా నాగేశ్వరరావు, తిరుపతిరావు, రుద్రరాజు అంజిరాజు, రోటరీక్లబ్ ప్రెసిడెంట్ సురేష్, ఇంటర్నేషనల్ కరాటే నిపుణులు కొండ్ర కీరన్ తదితరులు పాల్గొన్నారు. -
హ్యాండ్బాల్ జిల్లా జట్టుకు ఎంపిక
శ్రీరాంపూర్ : జిల్లా స్థాయి సబ్జూనియర్స్ హ్యాండ్ బాల్ జిల్లా జట్టుకు నస్పూర్ మార్టిన్ గ్రామర్ స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ నెల 2న జరిగిన ఎంపికలో వీరికి చోటు దక్కింది. పాఠశాల విద్యార్థులు ఏ.మనీషా, వి.లక్ష్మీప్రియ, సుప్రతిక ఎంపికయ్యారు. వీరు త్వరలో హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పీఈటీ పెంచాల వేణు తెలిపారు. ఈ విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ సబియాసుల్తానా, వైస్ ప్రిన్సిపల్ వసీం రాజా, సాధన స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు సాయి, వేణు, వంశీకష్ణ, బాలకష్ణ అభినందించారు.