ఎన్‌టీపీసీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం | Disruption in the power supply to NTPC | Sakshi
Sakshi News home page

ఎన్‌టీపీసీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

Aug 9 2016 8:41 PM | Updated on May 3 2018 3:20 PM

సింహాద్రి ఎన్టీపీసీ మొదటి యూనిట్‌లో ఏర్పడిన సాంకేతిక కారణాలు వలన సోమవారం రాత్రి యూనిట్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

 సింహాద్రి ఎన్టీపీసీ మొదటి యూనిట్‌లో ఏర్పడిన సాంకేతిక కారణాలు వలన సోమవారం రాత్రి యూనిట్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా యూనిట్ నుంచి సరఫరా కావాలసిన 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం కలిగింది. మొదటి యూనిట్ బ్రాయిలర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిసింది. సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. బుధవారం నాటికి సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement