రెండేళ్ల డిప్లొమా ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 20వ తేదీ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు హిందూపురం పాలిటెక్నికల్ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ రఘుమూర్తి మంగళవారం తెలిపారు.
హిందూపురం అర్బన్ : రెండేళ్ల డిప్లొమా ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 20వ తేదీ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు హిందూపురం పాలిటెక్నికల్ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ రఘుమూర్తి మంగళవారం తెలిపారు.
కర్నూలు తాండ్రపాడు పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్‌వీ పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ర్యాంక్ కార్డు, ఇతర ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. కౌన్సెలింగ్ ఫీజు ఓసీ, బీసీలకు రూ.1000, ఎస్సీ, ఎస్టీలకు రూ.500 ఉంటుందని వివరించారు.