మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్లను ఎవరిని తాగుబోతులు అని అనలేదని, ఏమైన ఉంటే విచారణ జరిపించుకోవాలని నల్లగొండ రీజినల్ సెక్యురిటీ సబ్ ఇన్స్‌పెక్టర్ దామోదర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్లను ఎవరిని తాగుబోతులు అని అనలేదని, ఏమైన ఉంటే విచారణ జరిపించుకోవాలని నల్లగొండ రీజినల్ సెక్యురిటీ సబ్ ఇన్స్‌పెక్టర్ దామోదర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున డ్రైవర్లను బీఏసీ (బీత్ ఎనలైజర్ మిషన్)తో ఆర్టీసీ కానిస్టేబుల్ గోపాలకృష్ణ పరిశీలన చేశారన్నారు. అయితే అనే వ్యక్తి డ్రైవర్లు కె.రామకృష్ణకు 13ఎంజీ/100ఎంఎల్, ఇతడికే రెండోసారి 7ఎంజీ రాగా, ఎం.ఎస్ నాయక్ 8ఎంజీ/100ఎంఎల్, రెండోసారి జీరో వచ్చిందని, ఎన్.రాములు 10ఎంజీ/100ఎంఎల్ రాగా రెండోసారి జీరో వచ్చిందన్నారు. రామకృష్ణకు మూడో సారి బ్రితింగ్ పెట్టాలని కార్మికులు డీఎం సుధాకర్‌పై వత్తిడి చేశారని, ఉన్నతాధికారుల అనుమతి తీసుకుంటే మూడో సారికి అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. అంతే తప్ప ఎవరినీ తాగుబోతులు అనలేదన్నారు. డ్రైవర్లు చేసిన బంద్‌కు తాను బాధ్యుడిని కాదన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు ఈ చెకింగ్ తప్పని సరిగా జరుగుతుందన్నారు. తాను కేవలం సూపర్‌వైజింగ్ మాత్రమే చేస్తానని అన్నారు.