ద్వారకా తిరుమల : శ్రీవారి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో కిక్కిరిసింది. అలాగే నూతన వధువరులతో కళకళలాడింది.
భక్తజన సంద్రం.. చిన తిరుపతి క్షేత్రం
Dec 11 2016 12:13 AM | Updated on Sep 4 2017 10:23 PM
ద్వారకా తిరుమల : శ్రీవారి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో కిక్కిరిసింది. అలాగే నూతన వధువరులతో కళకళలాడింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున ముహూర్తాల్లో వివాహాలు జరుపుకున్న నూతన వధూవరులు, వారి బంధువులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకోవడంతో సందడి నెలకొంది. దాదాపు 20 వేల మందికి పైబడి భక్తులు స్వామివారిని దర్శించినట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు తెలిపారు. 5 వేల మందికిపైగా యాత్రికులు స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించినట్టు చెప్పారు. తిరుమల తిరుపతి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు ప్రాంతాలకు చెందిన భజనమండళ్లు ఆలయ పరిసరాల్లో నిర్వహించిన కోలాట భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదికపై కోలాటాలు నిర్వహించారు.
Advertisement


