'నీళ్లు రానప్పుడు కొత్త ప్రాజెక్ట్లు ఎలా కడతారు?' | devineni uma takes on telangana government | Sakshi
Sakshi News home page

'నీళ్లు రానప్పుడు కొత్త ప్రాజెక్ట్లు ఎలా కడతారు?'

Apr 16 2016 9:51 AM | Updated on Mar 28 2019 5:34 PM

తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ఎత్తిపోతల ప్రాజెక్ట్లు నిర్మిస్తోందని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు.

విజయవాడ : తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ఎత్తిపోతల ప్రాజెక్ట్లు నిర్మిస్తోందని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దేవినేని నెహ్రు మాట్లాడుతూ... నీటి కేటాయింపులు లేకుండా కొత్త ప్రాజెక్ట్లు చేపట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కర్ణాటక, మహారాష్ట్రలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్ట్లను ఏపీ, తెలంగాణ కలసి అడ్డుకోవాలని సూచించారు. పైనుంచి నీళ్లు రానప్పుడు కొత్త ప్రాజెక్ట్లు ఎలా కడతారని దేవినేని ఉమ.. తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement