విద్యతోనే సర్వతోముఖాభివద్ధి | develapment is education | Sakshi
Sakshi News home page

విద్యతోనే సర్వతోముఖాభివద్ధి

Aug 15 2016 10:34 PM | Updated on Sep 4 2017 9:24 AM

విద్యతోనే సర్వతోముఖాభివద్ధి

విద్యతోనే సర్వతోముఖాభివద్ధి

తెయూ(డిచ్‌పల్లి): విద్యతోనే సర్వతోముఖాభివద్ధి సాధించవచ్చని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ పి.సాంబయ్య పేర్కొన్నారు. సోమవారం తెయూ పరిపాలనా భవనంపై ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

తెయూ(డిచ్‌పల్లి): విద్యతోనే సర్వతోముఖాభివద్ధి సాధించవచ్చని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ పి.సాంబయ్య పేర్కొన్నారు. సోమవారం తెయూ పరిపాలనా భవనంపై ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులో సామర్థ్యాన్ని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోనే అత్యధిక శాతం యువశక్తి మన దేశంలోనే ఉందని, అయితే, యూనివర్సిటీల్లో ఉన్నత విద్యలో ఇతర దేశాలతో పోలిస్తే వెనకంజలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దటానికి అధ్యాపకులు కషి చేయాలని కోరారు. మహిళలను ఇంటికే పరిమితం చేయడం వల్ల ఆర్థికంగా, సామాజికంగా వెనకబడ్డామన్నారు. అంతర్జాతీయ స్థాయి ్రMీ డా పోటీల్లో మన యువత రాణించి బంగారు పతకాలు తీసుకొచ్చి దేశ ఘనతను చాటాలని పిలుపునిచ్చారు. వర్సిటీలో ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తే తెయూను రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతానన్నారు. రిజిస్ట్రార్‌ జయప్రకాశ్‌రావు, ప్రిన్సిపల్స్‌ కనకయ్య, సత్యనారాయణచారి, జెట్లింగ్‌ ఎల్లోసా, టూటా అధ్యక్షుడు ప్రవీణ్, వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement