breaking news
vc sambaiah
-
విద్యతోనే సర్వతోముఖాభివద్ధి
తెయూ(డిచ్పల్లి): విద్యతోనే సర్వతోముఖాభివద్ధి సాధించవచ్చని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ పి.సాంబయ్య పేర్కొన్నారు. సోమవారం తెయూ పరిపాలనా భవనంపై ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులో సామర్థ్యాన్ని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోనే అత్యధిక శాతం యువశక్తి మన దేశంలోనే ఉందని, అయితే, యూనివర్సిటీల్లో ఉన్నత విద్యలో ఇతర దేశాలతో పోలిస్తే వెనకంజలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దటానికి అధ్యాపకులు కషి చేయాలని కోరారు. మహిళలను ఇంటికే పరిమితం చేయడం వల్ల ఆర్థికంగా, సామాజికంగా వెనకబడ్డామన్నారు. అంతర్జాతీయ స్థాయి ్రMీ డా పోటీల్లో మన యువత రాణించి బంగారు పతకాలు తీసుకొచ్చి దేశ ఘనతను చాటాలని పిలుపునిచ్చారు. వర్సిటీలో ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తే తెయూను రాష్ట్రంలోనే నెంబర్ వన్ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతానన్నారు. రిజిస్ట్రార్ జయప్రకాశ్‌రావు, ప్రిన్సిపల్స్ కనకయ్య, సత్యనారాయణచారి, జెట్లింగ్ ఎల్లోసా, టూటా అధ్యక్షుడు ప్రవీణ్, వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వండి
తెయూ(డిచ్పల్లి) : అధ్యాపకులు పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, టీచింగ్‌తో పాటు యూనివర్సిటీలో విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరముందని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పి.సాంబయ్య అన్నారు. గురువారం తెయూ ప్రధాన క్యాంపస్‌తో పాటు భిక్కనూరు సౌత్ క్యాంపస్‌లోనూ అధ్యాపకులతో నిర్వహించిన సమావేశాల్లో వీసీ మాట్లాడారు. అధ్యాపకులు, ఇతర సిబ్బంది కలిసి మెలిసి టీం వర్క్‌గా పని చేసి వర్సిటీలో మంచి వాతావరణం నెలకొల్పాలని సూచించారు. ఇక ముందు ప్రమోషన్లకు పనితీరు, పరిశోధనలతో సంబంధం ఉంటుందని ఆయన వెల్లడించారు. తాను ప్రతి మూడు నెలలకు అధ్యాపకులు, సిబ్బంది పనితీరును సమీక్షిస్తానని పేర్కొన్నారు. భిక్కనూరు సౌత్ క్యాంపస్‌ను తొలిసారిగా సందర్శించిన వీసీ, ఇన్చార్జి రిజిస్ట్రార్ జయప్రకాశ్ రావుతో కలిసి అన్ని విభాగాలను పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న హాస్టల్ భవనాల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. హాస్టల్ భవనాలు అన్ని సౌకర్యాలతో నిర్మాణ పనులు పూర్తిచేసి త్వరలోనే అందజేయాలని ఇంజినీరింగ్ సిబ్బందిని వీసీ ఆదేశించారు. క్యాంపస్‌లో నిర్ణయించిన మేరకు 2 వేల మొక్కలు నాటి హరితహారాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సౌత్ క్యాంపస్ ఆవరణలో వీసీ, రిజిస్ట్రార్లు మొక్కలను నాటారు. సౌత్ క్యాంపస్ ఆహ్లాదంగా ఉందని, దీనిని మరింతగా అభివృద్ధి చేసి అకడమిక్ నాణ్యతలో కొత్త ప్రమాణాలు చాటాలని వీసీ పిలుపునిచ్చారు. అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. వీసీని సౌత్ క్యాంపస్ అధ్యాపకులు, సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో వర్సిటీ ప్రజా సంబంధాల అధికారి రాజారాం, ప్రిన్సిపాల్ లలిత, వైస్ ప్రిన్సిపాల్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.