దేహదారుఢ్య పరీక్షలకు ‘వర్షం’ ఎఫెక్ట్‌ | Dehadarudhya exams 'rain' effect | Sakshi
Sakshi News home page

దేహదారుఢ్య పరీక్షలకు ‘వర్షం’ ఎఫెక్ట్‌

Jul 20 2016 12:39 AM | Updated on Aug 21 2018 5:54 PM

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కానిస్టేబుళ్ల భర్తీ కోసం ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న పోటీలకు వర్షం అడ్డుపడింది.

  • జేఎన్‌ఎస్‌లో నిలిచిన ఎంపిక ప్రక్రియ
  • వరంగల్‌ : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కానిస్టేబుళ్ల భర్తీ కోసం ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న పోటీలకు వర్షం అడ్డుపడింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో హన్మకొండలోని జేఎన్‌ఎస్‌ స్టేడియం మొత్తం బురదమయంగా తయారైంది. దీంతో ఎంపిక ప్రక్రియ బుధవారానికి వాయిదా పడింది. 
    కేయూ మైదానంలో 950 మంది హాజరు
    వరంగల్‌ రూరల్‌ జిల్లా పోలీసు పరిధిలో కానిస్టేబుళ్ల భర్తీ కోసం ఎంపిక చేసేందుకు కాకతీయ యూనివర్సిటీ మైదానంలో మంగళవారం 950 మందికి పరుగు పందెం నిర్వహించారు. సోమవారం రాత్రి వర్షం పడినప్పటికీ రన్నింగ్‌ ట్రాక్‌ పొడిగా మారడంతో అధికారులు అభ్యర్థులకు పరుగు పందెం నిర్వహించారు. గడిచిన నాలుగు రోజుల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను రూరల్‌ ఎస్పీ అంబర్‌ కిషోర్‌ఝూ పర్యవేక్షించారు. ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ములుగు ఏఎస్పీ విశ్వజిత్‌కంపాటి, డీఎస్పీలు రాజామహేంద్ర నాయక్, సత్యనారాయణరెడ్డి, సుదీంద్ర, రాంచందర్‌రావు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement